Mahakavi Srirangam Srinivasa Rao, popularly known as Sri Sri, was a renowned Telugu poet and writer. Born on 30th April 1910 in Visakhapatnam, Andhra Pradesh, Sri Sri was known for his progressive and revolutionary ideas, which he expressed through his poetry.
He started his career as a journalist and later became involved in the Indian independence movement. Sri Sri’s poetry was deeply influenced by his experiences and the political and social changes taking place in India at the time. His poems often dealt with themes of social justice, equality, and freedom.
Sri Sri is best known for his collection of poems called Maha Prasthanam, which is considered a masterpiece of Telugu literature. Maha Prasthanam is a collection of 104 poems that express the poet’s views on a wide range of subjects, including love, politics, society, and human nature.
Sri Sri’s poetry is known for its simplicity, directness, and powerful imagery. He is considered one of the pioneers of modern Telugu poetry and played a key role in shaping the literary culture of Andhra Pradesh.
Sri Sri received many awards and honors for his contribution to Telugu literature, including the Sahitya Akademi Award, Padma Shri, and Padma Bhushan. His legacy continues to inspire and influence Telugu poets and writers to this day.
Here are some of the best lines by Sri Sri:
నేనొక దుర్గమ్!
నాదొక స్వర్గమ్!
అనర్గళమ్, అనితర సాద్యమ్, నా మార్గమ్!
పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పోట్లూ, రానీ!
రానీ, రానీ!కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!
ఓ మహాత్మా , ఓ మహర్షి
ఏది చీకటి, ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం, ఏది పాపం
ఏది నరకం, ఏది నాకం
ఏది సత్యం, ఏదసత్యం
ఏదనిత్యం, ఏది నిత్యం
ఏది ఏకం, ఏదనేకం
ఏది కారణమేది కార్యంఓ మహాత్మా , ఓ మహర్షి
ఏది తెలుపు, ఏది నలుపు
ఏది గానం, ఏది మౌనం
ఏది నాది, ఏది నీది
ఏది నీతి, ఏది నేతి
నిన్న స్వప్నం, నేటి సత్యం
నేటి ఖేదం, రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతిఓ మహాత్మా , ఓ మహర్షి
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది,
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం !
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో !
బ్రతుకు వృధా , చదువు వృధా,
కవిత వృధా! వృధా, వృధా !
మనమంతా బానిసలం
గానుగలం, పీనుగులం!
వెనుక దగా, ముందు దగా!
కుడి యెడమల దగా, దగా!
మనది ఒక బ్రతుకేనా ?
కుక్కలవలె, నక్కలవలె !
మనది ఒక బ్రతుకేనా ?
సందులలో పందులవలె!